Home Sports_News ఇదేం పతనం బాబోయ్! వెస్టిండీస్ వాట్ ఎ పిటీ.. వరల్డ్‌కప్ దారి కష్టం

ఇదేం పతనం బాబోయ్! వెస్టిండీస్ వాట్ ఎ పిటీ.. వరల్డ్‌కప్ దారి కష్టం


ఒకప్పుడు ఛాంపియన్లు.. ఇప్పుడు క్వాలిఫయర్లు.

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్.. ఇప్పుడు వరల్డ్‌కప్‌ టికెట్ కోసం క్వాలిఫయర్ ఆడాల్సిన దుస్థితికి చేరుకుంది. 2027 వన్డే వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం చేజారిపోయింది. ఆఫ్ఘనిస్థాన్‌ ఐర్లాండ్‌పై గెలిచి టాప్‌-8లో చోటు ఖాయం చేసుకోవడంతో వెస్టిండీస్‌కు డైరెక్ట్ ఎంట్రీ తలుపు మూసుకుపోయింది.
రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్‌, రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టు ఇది. ఒకప్పుడు వెస్టిండీస్‌ పేరు వినగానే ప్రత్యర్థులు వణికేవారు. ఇప్పుడు మాత్రం ‘‘ముందు క్వాలిఫయర్ గెలవండి.. తర్వాత వరల్డ్‌కప్‌ గురించి మాట్లాడండి’’ అనే పరిస్థితి. నాలుగేళ్ల క్రితం కూడా ఇదే క్వాలిఫయర్ దారి పట్టి.. చివరికి వరల్డ్‌కప్‌ గుమ్మం దాటలేకపోయింది.

టికెట్ కోసం మూడు మెట్లు

వెస్టిండీస్‌ ఇప్పుడు 10 జట్ల క్వాలిఫయర్‌ టోర్నీలో బరిలోకి దిగనుంది. అక్కడ టాప్‌లో నిలిస్తే నేరుగా వరల్డ్‌కప్‌ బెర్త్‌ దక్కుతుంది. రెండో నుంచి నాలుగో స్థానాల్లో నిలిస్తే మరో సూపర్‌ సిరీస్‌ ప్లేఆఫ్‌ ఆడాలి. అక్కడ కూడా గెలిస్తేనే చివరి టికెట్‌ చేతికొస్తుంది. వెస్టిండీస్‌ క్రికెట్‌ ఇప్పుడు ఓ జట్టుకే కాదు.. ఓ స్వర్ణయుగానికే అద్దం పడుతోంది. ఒకప్పుడు కప్‌ కొట్టిన జట్టు.. ఇప్పుడు కప్‌లోకి రావడానికి క్వాలిఫయర్‌ కొట్టాల్సిన పరిస్థితి. వాట్ వెస్టిండీస్‌.. ఇది పతనమా, పునరాగమనానికి ముందు విరామమా? సమాధానం 2027 క్వాలిఫయర్‌ ఇస్తుంది.

 

#WestIndies #WestIndiesCricket #WorldCup2027 #ODIWorldCup #WorldCupQualifiers #WestIndiesWorldCup #Cricket #AfghanistanCricket #WorldCupQualification #CricketNews #WestIndiesDownfall #ODICricket #WorldCup #SportsNews #CricketNews