Home Naadesam_Special తెలంగాణ ఓటర్ల జాబితా 73 లక్షల ఫారాలు గల్లంతు

తెలంగాణ ఓటర్ల జాబితా 73 లక్షల ఫారాలు గల్లంతు


3.38 కోట్ల మంది ఓటర్లు నమోదు.

తెలంగాణలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్) ఎన్యుమరేషన్‌ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు గుర్తించారు. ఇందులో 2,64,87,214 ఎన్యుమరేషన్‌ ఫారాలను డిజిటైజ్‌ చేశారు. దీంతో 78.30 శాతం ప్రక్రియ పూర్తయింది.

73 లక్షల ఫారాలు ఇవ్వలేదు

మరో 73,39,234 ఫారాలు అంటే 21.70 శాతం ఇవ్వనట్టుగా నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు గుర్తించారు. మరో 11,25,546 మంది ఆచూకీ లేని లేదా అందుబాటులో లేని వారిగా నమోదయ్యారు.

మరణించిన ఓటర్లు.. డూప్లికేట్‌ నమోదులు

ఎన్యుమరేషన్‌ పరిశీలనలో 9,22,230 మంది మరణించినవారిగా గుర్తించారు. మరో 6,70,203 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనట్లు తేలింది. 1,02,294 ఫారాలను ఇతరుల కేటగిరీలో చేర్చారు. దీంతో ఓటరు జాబితాలోని ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించనున్నారు.

అర్హుల ఓట్లకు రక్షణ

ఓటరు జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించడమే SIR లక్ష్యమని అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లను కొనసాగిస్తూ.. మరణించినవారు, శాశ్వతంగా తరలిపోయినవారు, ఇతర ప్రాంతాల్లో నమోదైన వారి వివరాలను పరిశీలించనున్నారు. 73 లక్షలకు పైగా ఫారాలు అన్‌కలెక్టబుల్‌గా నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 

#TelanganaVoterList #SIR #TelanganaSIR #VoterList #VoterEnumeration #SpecialIntensiveRevision #TelanganaElections #TelanganaVoters #ElectionCommission #VoterVerification #ElectoralRoll #VoterListRevision #TelanganaNews #ElectionNews #IndiaNews