మూడు ఫార్మాట్లకు విడివిడి జట్లు – పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం

38

పాకిస్థాన్ క్రికెట్‌లో భారీ మార్పులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, జాతీయ సెలెక్టర్లు శ్రీకారం చుట్టారు. ఆధునిక క్రికెట్ అవసరాలకు అనుగుణంగా టెస్టులు, వన్డేలు, టీ20 ఫార్మాట్లకు విడివిడి జట్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులలో ఫార్మాట్ల వారీగా వర్గీకరణను మొదటి దశగా అమలు చేస్తున్నారు. ఈ విషయమై పీసీబీ సీనియర్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. ఒకే తరహా ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లకు సరిపోరని, ముఖ్యంగా టెస్ట్, టీ20 జట్లను వెంటనే వేరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడే స్పెషలిస్ట్ ఆటగాళ్లు నష్టపోకుండా ఉండేందుకు ఈ నూతన విధానాన్ని తెచ్చినట్లు పేర్కొన్నారు. టెస్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఆటగాళ్లకు నెలకు 40 లక్షల పాకిస్థానీ రూపాయల వరకు వేతనం లభిస్తుందని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి ఫార్మాట్‌కు పూర్తిస్థాయిలో ప్రత్యేకమైన జట్లు ఉంటాయని స్పష్టం చేశారు.

 

#PakistanCricket #PCB #AaqibJaved #PakistanTeam #TestCricket #ODICricket #T20Cricket #CricketNews #CentralContracts #CricketSelection #SpecialistPlayers #PakistanSelectors #WorldCricket #CricketUpdates #CricketReforms #PakistanTestTeam #PakistanT20Team #SportsNews #CricketStrategy #PCBNews