Home National_news ఓడిన చోటే గెలిచేందుకు బీజేపీ ప్లాన్

ఓడిన చోటే గెలిచేందుకు బీజేపీ ప్లాన్

పార్లమెంట్‌ను కుదుపుతున్న డీలిమిటేషన్.
ఎత్తులకు పైఎత్తులతో అపోజిషన్.
ఈసారైనా ఫలిస్తుందా మోడీ కాలిక్యూలేషన్.

ఏప్రిల్‌లో పార్లమెంటు సాక్షిగా ఎదురైన పరాభవం.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మక సవాలుగా మారింది! 298 ఓట్లతో ఆగిపోయిన డీలిమిటేషన్‌ బిల్లును ఈసారి ఎలాగైనా గట్టెక్కించాలనే పట్టుదలతో ఎన్డీఏ పావులు కదుపుతోంది. లక్ష్యం 360 ఓట్లు.. అందుకోసం గతంలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలతోనే మంతనాలు! తమిళనాట కాంగ్రెస్‌తో తెగతెంపుల తర్వాత డీఎంకే వైఖరిలో వచ్చిన మార్పు కేంద్రానికి ఆశలు రేపుతోంది. ఎనిమిది మంది ఎంపీలున్న శరద్‌ పవార్‌ ఎన్సీపీ కూడా 50 శాతం సీట్ల పెంపు హామీతో మద్దతుకు సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది. వైఎస్సార్‌సీపీ, చిన్న పార్టీలు, స్వతంత్రుల ఓట్లపైనా కేంద్రం లెక్కలు వేస్తోంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాలకు పెరిగే ప్రాతినిధ్యం.. దక్షిణాది రాష్ట్రాల వాటాకు ఎదురయ్యే ముప్పు.. ఎంపీల సంఖ్య పెంపుతో దేశంపై పడే భారం.. ఇవన్నీ కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొందరు ఎంపీలు సభకు రాకపోయినా మెజారిటీ లెక్కలు మారిపోవచ్చు. అంటే ఈసారి పోరు కేవలం బిల్లు ఆమోదం కోసమే కాదు.. రాజకీయ ప్రతిష్ఠ, రాష్ట్రాల ప్రాతినిధ్యం, దేశ భవిష్యత్తు దిశను నిర్ణయించే పోరు! నవంబర్‌ 30 నుంచి పార్లమెంటులో ఏం జరగబోతోంది? 360 ఓట్ల మ్యాజిక్‌ సాధ్యమవుతుందా?

 

#DelimitationBill #BJP #NDA #NarendraModi #Parliament #DelimitationDebate #DMK #SharadPawar #NCP #YSRCP #SouthIndia #LokSabha #PoliticalNews