నేతల లుక్ వెనుక రాజకీయ లెక్కలెన్నో!
మాస్ లుక్ కోసమే కేటీఆర్ మేకోవర్!
రేవంత్ రెడ్డికి అస్త్రాన్ని అందించారా ?
నేతల ఆహార్యం ఓట్లు కురిపిస్తుందా ?
రాజకీయాల్లో మాటల యుద్ధం మామూలే.. కానీ ఇప్పుడు గడ్డాలు, చొక్కాలు కూడా యుద్ధరంగంలోకి దిగాయి! నిన్నటివరకు క్లాస్ లుక్‌తో కనిపించిన కేటీఆర్ ఒక్కసారిగా గడ్డం పెంచితే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మాస్ ఇమేజ్ కోసమేనా ఈ కొత్త అవతారం? లేక ప్రజలకు మరింత చేరువయ్యే రాజకీయ వ్యూహమా? రేవంత్ రెడ్డి మాత్రం ఈ మార్పును వదిలిపెట్టలేదు. నల్లమల పులి, నక్క వాతలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే.. కేటీఆర్ సైతం ఎదురుదాడికి దిగారు. గడ్డం పెంచితే రేవంత్ అయిపోతారా? అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడే కథకు మరో మలుపు! గతంలో ఉత్తమ్ గడ్డంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేటీఆర్‌కు రాజకీయ అస్త్రాలుగా మారాయి. మరోవైపు రేవంత్ కొత్త చొక్కాలు, జగన్ ఆపిల్ కట్ షర్టులు చర్చలోకి వచ్చాయి. ఎన్టీఆర్ ఖాకీ దుస్తుల నుంచి వైఎస్సార్ పంచెకట్టు వరకు, కేసీఆర్ ఖద్దరు నుంచి మోదీ జాకెట్ వరకు.. ప్రతి నాయకుడి రూపం వెనుక ఓ ప్రత్యేక రాజకీయ ముద్ర ఉంది. మరి ఈ లుక్‌లతో ఓట్లు కురుస్తాయా? వేషమే విజయాన్ని తెస్తుందా? గడ్డం పెంచితే మాస్.. చొక్కా మార్చితే క్లాస్.. కానీ ప్రజల మనసు గెలిచేదెవరు? అసలు రాజకీయ విజయానికి అసలైన కొలమానం ఏమిటి? లోపలి పేజీలో ఆసక్తికర కథనం!
#KTR #RevanthReddy #KCR #TelanganaPolitics #PoliticalMakeover #PoliticalImage #YSJagan #YSRajasekharaReddy #NarendraModi #PoliticalStyle











