Home AP జగన్‌ను వీడలేదు.. పరిస్థితులే నెట్టేశాయి!

జగన్‌ను వీడలేదు.. పరిస్థితులే నెట్టేశాయి!

ఆత్మగౌరవం కోసమే పార్టీ నుంచి బయటకు..
కోటరీ అవమానాలే వైసీపీ వీడటానికి కారణం.
కొత్త రాజకీయ వేదికతో మూడో ప్రత్యామ్నాయం.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి భావోద్వేగం.

వైఎస్సార్‌సీపీని తాను స్వచ్ఛందంగా వీడలేదని, పార్టీలో కొందరు సృష్టించిన పరిస్థితులే బయటకు వచ్చేలా చేశాయని విజయసాయిరెడ్డి భావోద్వేగంగా వెల్లడించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ప్రభావంలో ఆయన చిక్కుకున్నారని, తనను పదేపదే అవమానించడంతో ఆత్మగౌరవం కోసం పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ రెండు కులాలు, రెండు కుటుంబాల ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. అన్ని సామాజిక వర్గాలు, మతాలకు సమాన న్యాయం చేసే మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు వస్తామని ప్రకటించారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, పారదర్శక పాలన తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు.

కులమతాల కంటే ప్రజా సమస్యలే ముఖ్యం..

కొత్త పార్టీలో యువతకు, కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. సుమతీరెడ్డి, దళిత సంఘాల నేత బోణి గణేష్‌ వంటి వారు తనతో కలిశారని, మరిన్ని వర్గాల నుంచి నాయకులు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రజల రోజువారీ జీవితాలను ఉద్యోగాలు, రవాణా, భద్రత వంటి సమస్యలు ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం కులం, మతం ఎందుకు ప్రధాన అంశాలవుతున్నాయని ప్రశ్నించారు. ప్రజల సమస్యల కంటే వారి గుర్తింపులను రెచ్చగొట్టడం రాజకీయ వ్యవస్థకు సులభమైందని, అందులో తనకూ భాగస్వామ్యం ఉందని అంగీకరించారు. ప్రజలు తమ ప్రాధాన్యతలు మార్చుకోవాలంటే రాజకీయ నాయకులే ముందుగా తమ ఎజెండాను మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు.

 

#VijayasaiReddy #YSRCP #YSJaganMohanReddy #NewPoliticalParty #AndhraPradeshPolitics #ThirdAlternative #APPolitics #PoliticalDevelopments #SocialJustice #TransparentGovernance