Home AP జాతీయ పరీక్షల్లో సమాన అవకాశాలే లక్ష్యం!

జాతీయ పరీక్షల్లో సమాన అవకాశాలే లక్ష్యం!

నందన్‌ నీలేకనితో చంద్రబాబు, లోకేశ్‌ భేటీ.

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో జాతీయ ఎగ్జామినేషన్‌ రిఫార్మ్స్‌ హైపవర్డ్‌ టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ నందన్‌ నీలేకని సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో పరీక్షా విధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఈ భేటీలో చర్చించారు. దేశంలోని విద్యార్థులందరికీ ప్రాంతం, నేపథ్యంతో సంబంధం లేకుండా సమాన అవకాశాలు కల్పించేలా పరీక్షా విధానం ఉండాలని చంద్రబాబు, లోకేశ్‌ సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమానత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేసే విధంగా సంస్కరణలు రూపొందించాలని టాస్క్‌ఫోర్స్‌కు దిశానిర్దేశం చేశారు. జాతీయ పరీక్షా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే అంశాలపై ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

#ChandrababuNaidu #NaraLokesh #NandanNilekani #NationalExaminationReforms #EducationReforms #ExamReforms #CompetitiveExams #EqualOpportunities #Amaravati #AndhraPradesh