అనిరుధ్ మ్యూజిక్కు ఫిదా!
సూపర్‌స్టార్ రజనీకాంత్ మాస్ మేనియా మరోసారి వెండితెరపై ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతుంటే.. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలతో జైలర్ 2 క్రేజ్ మరింత పెరిగింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్పై బన్నీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ స్టార్ పవర్, స్టైల్, స్వాగ్, ఆరా అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయని ప్రశంసిస్తూ.. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచే కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను అభివర్ణించారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ పనితీరుపై బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. “బ్రదర్.. అదరగొట్టేశావ్!” అంటూ ఆయన సంగీతానికి కితాబిచ్చారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత కృషిని కూడా అభినందించిన అల్లు అర్జున్.. నెల్సన్ దిలీప్‌కుమార్‌ను అసలైన షోమ్యాన్గా కొనియాడారు. ఆయన తెరకెక్కించిన చిత్రం బాంబులా పేలిన కూలెస్ట్ హిట్ అంటూ ప్రశంసించారు. కూలీ తర్వాత రజనీ నుంచి వస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. బన్నీ ప్రశంసలతో ఆ అంచనాలకు మరింత ఊపు వచ్చింది.
#Jailer2 #AlluArjun #Rajinikanth #NelsonDilipkumar #AnirudhRavichander #TamilCinema #TeluguCinema #MovieUpdates #Kollywood #Tollywood











