Home Celebrity నాది దక్షిణాది అందుకు గర్వపడుతున్నా

నాది దక్షిణాది అందుకు గర్వపడుతున్నా

అన్ని భాషల్లోనూ నటిస్తా!
ట్రోలింగ్‌‌పై తగ్గేదేలేదన్న రష్మిక .

భాష వేరు.. యాస వేరు.. కానీ నటనకు హద్దులెక్కడ? దక్షిణాది యాసపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గేది లేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన మాటలతో స్పష్టం చేసింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి నటన, భాష, డైలాగ్ డెలివరీ, యాస అంటూ తనను టార్గెట్ చేసిన ట్రోలర్లకు ఈ బ్యూటీ గట్టిగానే సమాధానమిచ్చింది. కాఫీ విత్ కరణ్ సీజన్ 9 వేదికపై భర్త విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న రష్మిక తన కెరీర్ ప్రయాణంలోని అనుభవాలను పంచుకుంది. “నేను దక్షిణ భారతదేశానికి చెందిన అమ్మాయిని.. నా మాటల్లో దక్షిణాది యాస ఉండటంలో తప్పేంటి?” అంటూ తనను విమర్శించేవారికి సూటిగా ప్రశ్నించింది. ఒక్క భాషకో, ఒక్క సినీ పరిశ్రమకో పరిమితం కావడం తనకు ఇష్టం లేదని, అన్ని భాషల్లో నటిస్తూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించాలన్నదే తన లక్ష్యమని చెప్పింది. యానిమల్, చావా, కాక్‌టెయిల్ 2 వంటి చిత్రాల్లో తన యాసపై వచ్చిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తన ప్రాంతపు గుర్తింపును దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, తన పాత్రకు మరో డబ్బింగ్ ఆర్టిస్ట్ గొంతు బాగుంటుందని దర్శకులు భావిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ముందుగానే చెబుతానని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పాలని దర్శకులు కోరడం గర్వంగా భావిస్తున్నానని తెలిపింది. ఒక్కో భాషలో డైలాగులు పలకడం వెనుక ఎంతో శ్రమ ఉందని, ఆ కష్టానికి గుర్తింపు లభిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదని చెప్పింది. యానిమల్ వంటి భారీ చిత్రాలతో పాటు ది గర్ల్‌ఫ్రెండ్ లాంటి భిన్నమైన కథల్లో భాగం కావడం నటిగా తనకు ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొంది.

 

#RashmikaMandanna #AccentTrolling #SouthIndian #VijayDeverakonda #CoffeeWithKaran #BollywoodNews #Tollywood #AnimalMovie #Chhaava #Cocktail2 #TheGirlfriend