Home Cinema_News మాఇంటి బంగారం ఓపెనింగ్ కలెక్షన్స్ అదుర్స్

మాఇంటి బంగారం ఓపెనింగ్ కలెక్షన్స్ అదుర్స్

44

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ’మా ఇంటి బంగారం’ థియేటర్లలో సాలిడ్ ఓపెనింగ్ సాధించింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం తొలిరోజు భారతదేశంలో రూ.5.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఇండియా గ్రాస్ కలెక్షన్ సుమారు రూ.6.20 కోట్లుగా నమోదుకాగా. దేశవ్యాప్తంగా 2,658 షోలలో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.4.50 కోట్ల గ్రాస్ రావడంతో తొలిరోజు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్ రూ.10.70 కోట్లకు చేరింది. రిజియన్ వారీగా చూస్తే ఆంధప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.4.75 కోట్ల గ్రాస్‌తో టాప్‌లో నిలిచాయి. కర్ణాటకలో రూ.90 లక్షలు, తమిళనాడులో రూ.38 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు 2ఆ వెర్షన్‌కు ఆక్యుపెన్సీ రోజంతా పెరుగుతూ వచ్చింది. ఉదయం షోలకు 26.15 శాతం ఉన్న ఆక్యుపెన్సీ, రాత్రి షోలకు 51.38 శాతానికి చేరింది. ప్రీమియం తెలుగు ఇఖఎఖి ఫార్మాట్‌కు 96 శాతం ఓవరాల్ ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో దాదాపు హౌస్‌ఫుల్స్ పడగా, రాత్రి షోలకు 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. ’ఖుషి’ 2023 తర్వాత సమంత తెలుగు సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను నిజం చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుష, శ్రీముఖి,శ్రీలక్క్ష్మి కీలక పాత్రల్లో నటించారు.

 

#MaaIntiBangaram #Samantha #SamanthaRuthPrabhu #NandiniReddy #TeluguCinema #Tollywood #BoxOffice #BoxOfficeCollection #OpeningDayCollection #MovieReview #ActionDrama #SamanthaMovie #MaaIntiBangaramCollections #Diganth #GulshanDevaiah #Gautami #Sreemukhi #TeluguMovie #MovieSuccess #CinemaNews #TollywoodUpdates #APTSCollections #OverseasCollection #WorldWideCollection #MovieBuzz #FilmNews #EntertainmentNews #LatestMovies #BlockbusterTalk #BoxOfficeReport