టీమిండియాలో ప్రతిభకు కొదవలేదు.. కానీ ఆ ప్రతిభకు తగ్గ అవకాశాలు దక్కుతున్నాయా? బీసీసీఐ సెలెక్టర్లకు మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గట్టిగానే చురకలంటించాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ లాంటి ప్రతిభావంతులను వన్డే జట్టులో తరచూ ఎంపిక చేయకపోవడం వారి సామర్థ్యానికి అన్యాయం చేయడమేనని స్పష్టం చేశాడు. ముఖ్యంగా తన శిష్యుడు అభిషేక్‌ను వన్డేల్లో చూడాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. సీనియర్ ఆటగాళ్లతో జట్టులో పోటీ ఎక్కువగా ఉంటుందని అంగీకరిస్తూనే, యువ ఆటగాళ్ల ప్రదర్శనను గుర్తించి త్వరలోనే అవకాశాలు కల్పించాలని సూచించాడు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అభిషేక్ విధ్వంసం మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. కేవలం 15 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి, 35 బంతుల్లో శతకం బాదాడు. తన గురువు యువీ 2007లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో అర్ధశతకం సాధించిన రికార్డుకు చేరువగా వచ్చాడు. దీనిపై యువీ సరదాగా చేసిన సవాల్‌కు అభిషేక్ కూడా చమత్కారంగా స్పందించాడు. 12 బంతుల్లో అర్ధసెంచరీ చేయడం అంత సులభం కాదన్నాడు. మైదానంలో యువీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న అభిషేక్‌కు ఇప్పుడు వన్డేల్లోనూ అవకాశం ఇవ్వాలన్నది గురువు డిమాండ్! యువ ప్రతిభకు సెలెక్టర్లు ఎప్పుడు పట్టం కడతారో చూడాలి.
#YuvrajSingh #AbhishekSharma #IshanKishan #VaibhavSuryavanshi #TeamIndia #ODISelection #BCCI #IndianCricket #T20Cricket #INDvsNZ #CricketNews











