Home Cinema_News రక్తపాతం.. రౌద్రం.. విశ్వక్‌సేన్‌ ‘కల్ట్‌’ విధ్వంసం!

రక్తపాతం.. రౌద్రం.. విశ్వక్‌సేన్‌ ‘కల్ట్‌’ విధ్వంసం!

గోవా గ్యాంగ్‌లకు సింహస్వప్నం.
డీఎస్పీ సంకల్ప్‌ నాయ‌క్‌ ఊచకోత!

యాక్షన్‌ అంటే బుల్లెట్లు.. థ్రిల్‌ అంటే ఛేజింగులు.. కానీ రక్తపాతం, భయానక పోరాటాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు విశ్వక్‌సేన్‌ ‘కల్ట్‌’తో రంగంలోకి దిగాడు! దర్శకుడిగా మరోసారి మెగాఫోన్‌ పట్టుకున్న విశ్వక్‌.. ఈసారి ఇండియాలోనే తొలి స్లాషర్‌ చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘కల్ట్‌’తో సంచలనానికి సిద్ధమయ్యాడు. ఏ సర్టిఫికెట్‌ పొందిన ఈ చిత్రం థియేటర్లలోకి రావడానికి కొన్ని గంటల ముందే విడుదలైన రిలీజ్‌ ట్రైలర్‌.. కత్తిపోట్లు, రక్తపాతం, ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలతో సినిమా ఎంత క్రూరంగా ఉండబోతోందో సంకేతాలిచ్చింది. తొలి ట్రైలర్‌ పార్టీలో జరిగే ఘటనలు, స్లాషర్‌ నేపథ్యాన్ని పరిచయం చేయగా.. తాజా ట్రైలర్‌ మాత్రం డీఎస్పీ సంకల్ప్‌ నాయక్‌గా విశ్వక్‌ చూపించే విశ్వరూపంపై దృష్టి పెట్టింది. గోవాలో స్థానికులు స్థానికేతరులను, ముఖ్యంగా తెలుగు వారిని వేధించడాన్ని సహించని పోలీసు అధికారి.. వారిని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఇక పార్టీ నేపథ్యంలో సాగే చివరి సన్నివేశాల్లో అతడి విధ్వంసకర దాడులు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. విశ్వక్‌ రౌద్రం, దూకుడు పాత్రకు తగ్గట్టుగా కనిపిస్తుండగా.. స్లాషర్‌ సన్నివేశాలకు ఇచ్చిన స్టైలిష్‌, కార్టూన్‌ తరహా రూపం హింసాత్మక దృశ్యాలకు ప్రత్యేకమైన తెరరూపాన్ని అందిస్తోంది. రాజకీయ నాయకుడిగా మురళీశర్మ, సీనియర్‌ పోలీసు అధికారిగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటించగా.. గాయత్రి భరద్వాజ్‌, తారక్‌ పొన్నప్ప కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తారక్‌ సినిమాస్‌ పతాకంపై సందీప్‌ కకరాల నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం అందించగా, తరుణ్‌ భాస్కర్‌ సంభాషణలు రాశారు. మరి సంకల్ప్‌ నాయక్‌ రౌద్రం వెండితెరపై ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి!

 

#VishwakSen #CultMovie #CultReleaseTrailer #SankalpNaik #TeluguCinema #SlasherFilm #ActionThriller #GoaGangs #MuraliSharma #SrikanthIyengar #GayatriBharadwaj #TarakPonnappa #RaviBasrur #TharunBhascker #TarakCinemas