బీజేపీ–జనసేన నీడకు సాయిరెడ్డి..!
వేణుంబాక వాస్తవ రూపం ఇదేనా..?
ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడు.. పార్టీలో కీలక వ్యూహకర్త.. ఢిల్లీలో వైసీపీ గొంతుకగా కనిపించిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు అదే జగన్పై వరుస విమర్శలతో ఎందుకు ముందుకొస్తున్నారు? నిన్నటి వరకు రాజకీయంగా నీడనిచ్చిన చెట్టుపైనే ఇప్పుడు గొడ్డలి ఎందుకు ఎత్తారు? ఇది వ్యక్తిగత ఆవేదనా.. రాజకీయ పునరాగమన వ్యూహమా.. లేక కొత్త రాజకీయ శిబిరానికి ముందస్తు అడుగులా? 2025లో రాజ్యసభ, వైసీపీకి రాజీనామా చేసి వ్యవసాయం వైపు వెళ్తానన్న సాయిరెడ్డి.. ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటన దిశగా అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరతీసింది. జగన్పై, వైసీపీ అంతర్గత వ్యవహారాలపై ఆయన చేస్తున్న విమర్శలతో పాటు మతమార్పిడులు, హిందుత్వం, రాయలసీమ అభివృద్ధి, కుల ప్రాతినిధ్యం వంటి అంశాలను ముందుకు తేవడం మరింత ఆసక్తి రేపుతోంది. మరోవైపు జనసేన, బీజేపీలపై ఆయన వైఖరి ఎలా ఉంది? ఢిల్లీ సంబంధాలు ఆయన భవిష్యత్ రాజకీయానికి ఎంతవరకు ఉపయోగపడతాయి? వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల వెనుక ఏముంది? జగన్ను బలహీనపర్చడమే లక్ష్యమా.. లేక తనకంటూ కొత్త రాజకీయ స్థానం వెతుక్కోవడమే అసలు ఉద్దేశమా? సాయిరెడ్డి వేసే ప్రతి అడుగు వెనుక ఉన్న ఈ రాజకీయ లెక్కలే ఇప్పుడు అసలు కథ.
#VijayaSaiReddy #APPolitics #NewPoliticalParty #ThirdPoliticalAlternative #YSJaganMohanReddy #YSRCP #JanaSena #BJP #AndhraPradeshPolitics #PoliticalComeback #RayalaseemaDevelopment #YouthPolitics











