Home Telangana విస్తుపోయే ఆస్తుల చిట్టా

విస్తుపోయే ఆస్తుల చిట్టా

రోజుకో మలుపు తిరిగితే ఎట్టా?
అసెట్స్‌పై నిగ్గు తేల్చలంటూ సవాళ్ళ పర్వం.
విచారణ జరిగితే వెలుగులోకి వస్తాయి సర్వం.
ఆస్తుల లెక్కలతో రాజకీయ సమరం.
రేవంత్-కేటీఆర్ పరస్పర ఆరోపణలతో కొత్త ట్విస్ట్ .

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద పంచాయితీ మొదలైంది.. ఈసారి అంశం అధికారం కాదు.. ఆస్తులు! పదేళ్లు పాలించిన కేసీఆర్ కుటుంబం వేల కోట్లు కూడబెట్టిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి సిరిసిల్ల వరకు సంచలన ఆరోపణలు చేస్తుండగా.. “నీ ఆస్తులు.. మా ఆస్తులు.. అన్నీ లెక్క తేలుద్దాం” అంటూ కేటీఆర్, హరీశ్ రావు ఎదురుదాడికి దిగుతున్నారు. ఫామ్‌హౌస్‌ల నుంచి హోటళ్ల వరకు.. హైదరాబాద్ భూముల నుంచి విదేశీ పెట్టుబడుల వరకు.. ఒక్కో ఆస్తి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కో బాంబుగా మారుతోంది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ భూములపై విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. జన్వాడ ఆస్తులపై రేవంత్ ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు తమ ఆస్తులన్నీ బహిరంగంగానే ఉన్నాయని కేటీఆర్ చెబుతున్నారు. అంతేకాదు.. రెండు కుటుంబాల ఆస్తులపై న్యాయ విచారణకు సిద్ధమని సవాల్ విసురుతున్నారు. దీంతో రాజకీయ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం కాస్తా ఆస్తుల లెక్కల యుద్ధంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో “ఎవరు దోచుకున్నారు?” అన్న ప్రశ్న ఇప్పుడు “ఎవరి ఆస్తులు ఎంత?” అన్న ప్రశ్నగా మారింది. ఆరోపణల వెనుక అసలు లెక్కలేంటి? రేవంత్ చెప్పే “పార్ట్-2”లో ఏముంది? కేటీఆర్ సవాల్‌కు కాంగ్రెస్ సమాధానం ఏంటి? తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ ఆస్తుల పంచాయితీ ఎక్కడికి దారి తీస్తుందో మరి…!?

 

#RevanthReddy #KTR #KTRAssets #KCRFamily #HarishRao #TelanganaPolitics #ErravelliFarmhouse #Janwada #BRS #Congress #AssetsRow #PoliticalControversy