Home Telangana సిద్దిపేట పదేళ్ల ప్రస్థానం

సిద్దిపేట పదేళ్ల ప్రస్థానం

పండుగలా చేసేందుకు సన్నాహాలు.
జిల్లా ఖ్యాతి దశదిశలా చాటేలా వేడుకలు.

సిద్దిపేట జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘పదేండ్ల పండుగ’ను ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి విడిపోయి ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన సిద్దిపేటకు అక్టోబర్‌ 11తో పదేళ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఖ్యాతి, కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సిద్దిపేట ప్రత్యేకతలు ప్రతిబింబించేలా ఉత్సవాలు ఉండాలని సూచించారు.

అన్ని వర్గాల భాగస్వామ్యంతో

సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆదివారం పదేళ్ల పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు. కవులు, కళాకారులు, జర్నలిస్టులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వ్యాపారులు సమావేశానికి హాజరయ్యారు. విద్యావేత్తలు, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి హరీశ్‌రావు అభిప్రాయాలు స్వీకరించారు. జిల్లా పదేళ్ల ప్రయాణాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించేందుకు అన్ని వర్గాల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యంతో ఉత్సవాలను నిర్వహించడమే లక్ష్యంగా సమావేశం సాగింది.

మూడు రోజుల పాటు సంబరాలు

సిద్దిపేట జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మూడు రోజుల పాటు పదేళ్ల ఉత్సవాలు నిర్వహించాలని హరీశ్‌రావు నిర్ణయించారు. జిల్లాగా ఏర్పడిన తర్వాత సాధించిన అభివృద్ధి, ప్రజల ప్రస్థానం, స్థానిక కళలు, సాంస్కృతిక వైభవాన్ని ఉత్సవాల్లో ప్రదర్శించేలా కార్యక్రమాలు ఉండనున్నాయి. పదేళ్ల పండుగ సిద్దిపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా నిర్వహించాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో పాటు సిద్దిపేట జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

 

#Siddipet #SiddipetDistrict #Siddipet10Years #PadendlaPanduga #HarishRao #THarishRao #SiddipetCelebrations #SiddipetDistrictFormation #Telangana #SiddipetCulture #SiddipetDevelopment #BRSTelangana #DeshapathiSrinivas #TelanganaPolitics #SiddipetNews