సుకుమార్ కోసం మెగా పవర్‌స్టార్ కొత్త అవతారం!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అంటేనే తెరపై కొత్తదనం.. పాత్ర కోసం ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే తపన! ఇప్పుడు మరోసారి తన లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు సుకుమార్‌తో మరోసారి చేతులు కలుపుతున్న చరణ్.. RC17 కోసం భారీ మేకోవర్‌కు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్లో కనిపించిన పౌరాణిక ఛాయలు ప్రేక్షకుల్లో ఆసక్తిని ఒక్కసారిగా పెంచేశాయి. పోస్టర్‌తోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిన ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ ఇప్పుడు తన శరీరాకృతిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. పెద్ది సినిమా కోసం పెంచుకున్న బరువును తగ్గించుకుంటూ, ఆ సినిమాలో కనిపించిన పొడవాటి జుట్టు లుక్కు కూడా స్వస్తి చెబుతున్నాడట. కొత్త కథకు, పాత్రకు తగ్గట్టుగా పూర్తిగా భిన్నమైన రూపంలో కనిపించేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం ఎవరికీ తెలియని ఓ ప్రత్యేక ప్రాంతంలో ఉండి బరువు తగ్గడంతో పాటు అవసరమైన ఫిజిక్‌ను సాధించే పనిలో ఉన్నట్లు సమాచారం. అంటే ప్రతి సినిమాకు ఓ కొత్త చేంజ్.. ప్రతి పాత్రకు ఓ కొత్త రూపం చూపించడమే చరణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. హీరోయిన్ ఎవరు? సంగీత దర్శకుడు ఎవరనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. సుకుమార్–రామ్ చరణ్ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈసారి చరణ్ ఎలాంటి అవతారంలో ప్రేక్షకుల ముందుకు వస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోసారి వెండితెరపై మెగా మ్యాజిక్కు సిద్ధం కావాల్సిందే!
#RamCharan #Sukumar #RC17 #RamCharanMakeover #MegaPowerStar #Peddi #MythriMovieMakers #Tollywood #TeluguCinema #UpcomingMovies











