టెక్నాలజీతో దిశ మార్పు.
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.
న్యూఢిల్లీలో జరుగుతున్న 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశ టెలికాం రంగంలో వచ్చిన మార్పులను వివరించారు. కరోనా సమయంలోనూ టెలికాం వ్యవస్థను విస్తరించి మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ అందించామని చెప్పారు. డిజిటల్ సదుపాయాల ద్వారా పల్లె ప్రజలకు బ్యాంకింగ్, వైద్యం, ప్రభుత్వ సేవలు సులభంగా అందుతున్నాయని తెలిపారు. టెలికాం సంస్కరణలతో పాలనలో పారదర్శకత పెరిగిందని, పేదలకు చేరాల్సిన సుమారు రూ.5 లక్షల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా కాపాడగలిగామని పేర్కొన్నారు. సంస్కరణలకు ఎలాంటి వ్యతిరేకత ఎదురైనా వాటి అమలు ఆగదని స్పష్టం చేశారు.
5జీ విస్తరణతో కొత్త వేగం
దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ నెట్వర్క్ చేరిందని మోదీ తెలిపారు. ప్రస్తుతం 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు సేవలందిస్తున్నాయని చెప్పారు. 2022తో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వేగం పది రెట్లు పెరిగిందని వెల్లడించారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఇన్వెస్ట్’, ‘ఇన్నోవేట్’తో మొబైల్స్, టెలికాం పరికరాల తయారీలో భారత్ ప్రపంచ కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. అదే సమయంలో డీప్‌ఫేక్స్, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఫోన్ సెక్యూరిటీ, నెట్వర్క్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డీప్‌ఫేక్స్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు, టెక్ సంస్థలు, ఆర్థిక రంగాలు కలిసి అంతర్జాతీయ ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తయిన సమయంలో ఐఎంసీ 10వ వార్షికోత్సవం జరగడం ప్రత్యేకమని మోదీ పేర్కొన్నారు.
#NarendraModi #IndiaMobileCongress #DigitalIndia #5GIndia #TelecomSector #DigitalTransformation #MakeInIndia #CyberSecurity #Deepfake #TelecomReforms #MobileInternet #TechnologyNews #IndiaNews











