Home AP అల్టిమేటమ్‌..!? బాబుతో పవన్ భేటీ

అల్టిమేటమ్‌..!? బాబుతో పవన్ భేటీ

ఎన్నికల హింసపై చర్చ .
సుప్రీం తీర్పుతో కొత్త ట్విస్ట్ .
నాడు వైసీపీలా మనం చేస్తే ఎలా?

అధికారం చేతిలో ఉంది.. అధికారం పంచుకున్నవాళ్ల మధ్యే అసలు మంట మొదలైందా? రెండున్నరేళ్ల కూటమి ప్రయాణంలో పైకి కనిపించేది ఐక్యతేనా.. లోపల మాత్రం అసంతృప్తి అగ్నిపర్వతంలా పేరుకుపోతోందా? “మీరు చేయాల్సింది మీరు చేస్తే.. నేను చేయాల్సింది నేను చేస్తా!” పవన్‌ కళ్యాణ్‌ వైఖరిపై వినిపిస్తున్న ఈ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. సీట్ల దగ్గర అన్యాయం.. నిర్ణయాల దగ్గర నిర్లక్ష్యం.. ఎన్నికల వ్యవహారాల్లో ఎదురవుతున్న విమర్శలు.. వీటన్నింటినీ ఇంకెంతకాలం భరించాలన్న ప్రశ్న జనసేన శ్రేణుల్లో వినిపిస్తోందన్న ప్రచారం! మరోవైపు బీజేపీ అసంతృప్తిపైనా ఊహాగానాలు.. స్థానిక ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యంతో పెరిగిన ఒత్తిడి! వెరసి కూటమి రాజకీయాల్లో కొత్త కలకలం. పవన్‌ నిజంగానే అల్టిమేటమ్‌ ఇచ్చారా? పొత్తులో కొనసాగాలా.. బయటకు రావాలా అన్న చర్చ నిజంగానే జరిగిందా? లేక ఇవన్నీ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న కథనాలేనా? మౌనం తుఫానుకు ముందు సంకేతమా.. హెచ్చరికే అసలు మోతనా? సమాధానం ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. కానీ ప్రశ్న మాత్రం గట్టిగానే వినిపిస్తోంది.. కూటమిలో భాగస్వామ్యమా.. లేక బరువుగా మారిన బంధమా? తెర వెనుక ఏం జరుగుతోంది? లోపలి కథలో అసలు లెక్కలేంటి? చదవండి.. కూటమి రాజకీయాల్లో రగులుతున్న అసలు రగడ!

 

#PawanKalyan #ChandrababuNaidu #TDPAAlliance #JanaSena #AndhraPradeshPolitics #CoalitionPolitics #BJP #LocalBodyElections #SupremeCourt #APPolitics #PoliticalNews