సన్‌రైజర్స్‌లోకి నూర్ అహ్మద్? వైరల్ అవుతున్న ట్రేడ్ ప్రచారం

10

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఆటగాళ్ల ట్రేడ్ వార్తలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకురానున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బలమైన స్పిన్ దళాన్ని సిద్ధం చేసుకోవాలని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భావిస్తున్నట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో సన్‌రైజర్స్‌కు చెందిన కొందరు ఆటగాళ్లపై సీఎస్కే కూడా ఆసక్తి చూపుతోందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ 2025 నుంచి సీఎస్కే తరఫున ఆడుతున్నాడు. 2025 సీజన్‌లో 24 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. 2026లో 13 వికెట్లు సాధించాడు. ప్రస్తుతం ట్రేడ్‌పై స్పష్టత లేకపోయినా, ఈ ప్రచారం ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

#IPL2027 #IPLTrade #NoorAhmad #ChennaiSuperKings #CSK #SunrisersHyderabad #SRH #IPLNews #CricketNews #IndianPremierLeague #AfghanistanCricket #NoorAhmed #CSKNews #SRHNews #IPLUpdates #CricketUpdates #TradeRumours #T20Cricket #SportsNews #BreakingNews