నిర్బంధాలపై న్యాయస్థానం ఆగ్రహం.
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో రాజధానిలో ఉద్రిక్తత.
ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ మొదలైన పోరు.. దేశ రాజధానిని కుదిపేసే స్థాయికి చేరింది! ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలో రగిలిన నిరసనలు కేంద్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి సవాలుగా మారాయి. జంతర్ మంతర్‌కు వెళ్లకముందే విమానంలోనే సీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడం.. వేలాది మంది నిరసనకారులను నిర్బంధించడం.. మెట్రో స్టేషన్ల మూసివేతతో రాజధాని రాకపోకలకు అంతరాయం కలగడం.. పరిస్థితిని మరింత వేడెక్కించాయి. తమ గొంతు నొక్కుతున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తుంటే, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలని పోలీసులు సమర్థించుకుంటున్నారు. ఈ ఉత్కంఠ మధ్య సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. అవసరం లేని బారికేడ్లను తొలగించాలని, మెట్రో సేవలు సాధారణంగా నడిచేలా చూడాలని, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిరసన హక్కును గుర్తిస్తూనే చట్టపరమైన పరిమితులను పాటించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించకూడదనే షరతుతో విడుదలైన సీజేపీ నేతలు వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. నిర్బంధాల చట్టబద్ధతపై న్యాయ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతుండగా, కేంద్రం, పోలీసుల చర్యలపై రాజకీయ వివాదం ముదురుతోంది. అసలు ఓటర్ల జాబితాలో అక్రమాల ఆరోపణల వెనుక ఏముంది? నిరసనకారులపై చర్యలకు చట్టం ఎంతవరకు అనుమతిస్తుంది? సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీలో పరిస్థితులు మారతాయా? రాజధానిలో రగులుతున్న ఈ పోరాటం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారాయి.
#GyaneshKumar #CEC #DelhiProtests #SupremeCourt #JantarMantar #ElectionCommission #VoterList #ElectionTransparency #CJP #DelhiPolice #RightToProtest #IndianPolitics #PoliticalNews #SupremeCourtIndia











