పెళ్లి కాంగ్రెస్‌ది.. ప్రశ్నలు అసద్వి!
ప్రతిపక్షాల నిరసనకు దూరం.
ఒక్క సామెతతో రాజకీయ దుమారం.
దేశ రాజకీయాల్లో మజ్లిస్ నయా పంచాయితీ!
రాజకీయ పెళ్లి మొదలైంది.. విపక్ష నేతలంతా ఒక్కచోట చేరారు.. ఎన్నికల సంఘంపై సమరశంఖం పూరించారు! కానీ ఈ రాజకీయ వేదికపై కనిపించని ఒక్క ముఖమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ! ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చేపట్టిన నిరసనకు ఆయన దూరంగా ఉండటమే కాదు.. ఒక్క హిందీ సామెతతో రాజకీయ రచ్చకు తెరలేపారు. “బేగానీ షాదీ మే మేరా క్యా కామ్?” పరాయివారి పెళ్లిలో నాకేం పని? అంటూ సంధించిన ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ శిబిరానికి సవాలుగా మారిందా? ప్రతిపక్ష ఐక్యతకు ఇది పరీక్షా? లేక తన రాజకీయ అస్తిత్వాన్ని చాటుకునే ఒవైసీ వ్యూహమా? సోషల్ మీడియాలో మీమ్స్ మోత మోగుతుంటే.. రాజకీయ ప్రత్యర్థులు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మజ్లిస్ శ్రేణులు మాత్రం ఎదురుదాడికి దిగుతున్నాయి. అసలు ఎన్నికల సంఘంపై ఒవైసీకి అభ్యంతరాలు లేవా? నిరసనకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఆహ్వానం అందలేదా.. లేక కూటమి రాజకీయాలకు దూరంగా ఉండటమే ఆయన లక్ష్యమా? సామెత చిన్నదే.. దాని వెనుక రాజకీయ లెక్కలు పెద్దవే! ఈ రచ్చలో అసలు ప్రశ్న మాత్రం ఒక్కటే.. నేతల రాజకీయ ఆధిపత్యమా ముఖ్యం? ప్రజల ఓటు హక్కా ముఖ్యం? తెర వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలేంటి?
#AsaduddinOwaisi #AIMIM #INDIABloc #Congress #ElectionCommission #GyaneshKumar #OppositionUnity #PoliticalControversy #VoterRights #IndianPolitics #OwaisiNews #TeluguPoliticalNews











