Home AP దేశంలో బలమైన బీజేపీ.. అనంతలో బలహీనం!

దేశంలో బలమైన బీజేపీ.. అనంతలో బలహీనం!

తీర్పుతో కూటమిలో కలకలం, ఐక్యతకు అసలు పరీక్ష.

దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి అనంతపురం మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. కేంద్రంలో అధికార పీఠం.. రాష్ట్రంలో కూటమి భాగస్వామ్యం.. అయినా ఒక్క మేయర్ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 13 కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి జెండా ఎగిరితే.. అనంతపురంలో మాత్రం వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. 5,981 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థిని ఓడించి వైసీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అసలు బీజేపీ బలహీనత బయటపడిందా? టీడీపీ సహకారం కొరవడిందా? అభ్యర్థి ఎంపికలోనే తప్పటడుగు పడిందా? నాలుగు డివిజన్లలో టీడీపీ రెబల్స్ విజయం వెనుక అసంతృప్తి ఉందా? లేక రాయలసీమలో వైసీపీ పట్టు ఇంకా చెక్కుచెదరలేదా? కార్పొరేటర్లలో కూటమికి మెజారిటీ ఉన్నా మేయర్ పీఠం చేజారడం వెనుక ఓటర్ల వ్యూహం ఏమిటి? ఈ ఒక్క ఓటమి కూటమి ఐక్యతపై అనేక ప్రశ్నలు సంధిస్తోంది. ఇది ఒక్క మేయర్ పదవి ఓటమి కాదు.. కూటమి సమన్వయానికి అసలైన పరీక్ష!

 

#Anantapur #AnantapurMayor #BJP #YSRCP #TDP #AndhraPradeshPolitics #MunicipalElections #MayorElectionResults #NDAAlliance #RayalaseemaPolitics #PoliticalSetback #CoalitionUnity