పట్టణ, గ్రామీణ ఎన్నికలకు మార్గదర్శకాలు.
న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా సవరణలు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి జీవో నంబర్ 251 విడుదల చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రిజర్వేషన్ల నిర్ణయానికి మార్గం చూపనున్నాయి.
గ్రామ పంచాయతీల్లో 50 శాతం పరిమితి
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 153 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించింది. డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు నిబంధనల్లో అవసరమైన సవరణలు చేసినట్లు వెల్లడించింది. పట్టణ స్థానిక సంస్థలకు ఒక జీవో, గ్రామ పంచాయతీలకు మరో జీవో జారీ చేయడం ద్వారా రిజర్వేషన్ల అమలుపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఈ మార్గదర్శకాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు కీలకం కానున్నాయి.
#APBCReservations #AndhraPradesh #LocalBodyElections #BCReservations #GONo251 #GONo153 #GramPanchayatElections #MunicipalElections #DedicatedCommission #SupremeCourt #APHightCourt #ReservationPolicy #APPolitics #AndhraPradeshNews











