అక్టోబర్ 15 నుంచి భారీ వర్షాలు?
వాయుగండ ప్రభావంతో వానలు.
ఆంధ్రప్రదేశ్‌కు వర్షాల రూపంలో ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. ఈ ప్రభావంతో అక్టోబర్ 15 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రపై ఈ వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు వెల్లడించాయి. అది మరింత బలపడితే వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవస్థ తుది దిశ, తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. అక్టోబర్ 14 నుంచి 16 మధ్య ఉత్తరాంధ్ర తీరానికి సమీపంగా వాయుగుండం లేదా తుపాను తరహా వ్యవస్థ ప్రభావం చూపవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
#AndhraPradeshWeather #APRainAlert #HeavyRainfall #October15 #BayOfBengal #LowPressure #CyclonicDepression #NorthAndhra #IMD #WeatherForecast #ElNino #CoastalAndhra #RainAlert #WeatherNews











