సుప్రీం కోర్టుకు చేరుతున్న వినతులు .
సుమోటోగా విచారణకు పెరుగుతున్న డిమాండ్లు .
దేశ అత్యున్నత న్యాయస్థానానికి రెండు వేల మంది లేఖ.
ఎన్నికల సంఘంపై పెరుగుతున్న అనుమానాలతో ఉత్కంఠ .
తొలగింపుపై రాజ్యాంగం ఏం చెబుతోందన్నదే అసలు ప్రశ్న .
ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనకు ఇదే సమయమంటున్న ప్రజానీకం.
ఓటరు జాబితాపై ప్రశ్నలు.. సీఈసీపై ఆరోపణలు.. సుప్రీంకోర్టు వైపు దేశం! 2,000 మందికి పైగా పౌరుల లేఖతో ఎన్నికల వ్యవస్థపై కొత్త తుపాను మొదలైంది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, ఈసీఐనెట్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సుమోటోగా జోక్యం చేసుకోవాలని వారు కోరారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంలోనే ఇద్దరు కమిషనర్లు పలు నిర్ణయాలపై లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న నివేదికలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలన్న ప్రతిపక్ష డిమాండ్లు, దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు ఈ వివాదాన్ని మరింత ఉత్కంఠకు చేర్చాయి. కానీ అసలు ప్రశ్న ఒక్కటే.. సీఈసీని తొలగించడం అంత సులభమేనా? రాజ్యాంగం ఏం చెబుతోంది? మరోవైపు ఓటర్ల పేర్ల తొలగింపు, సాఫ్ట్వేర్ మార్పులు, అధికారాల కేంద్రీకరణపై వచ్చిన ఆరోపణల వెనుక నిజం ఎంత? కేంద్ర ప్రభుత్వం దీనిని ఎలా ఎదుర్కోనుంది? ఎన్నికల సంఘం స్వతంత్రతపై పెరుగుతున్న అనుమానాలు దేశ ప్రజాస్వామ్యాన్ని ఎటువైపు నడిపించనున్నాయి? ఆరోపణలు, అభ్యంతరాలు, రాజ్యాంగ రక్షణలు, న్యాయపోరాటం.. ఈ మొత్తం వ్యవహారంలో దాగి ఉన్న అసలు కథ ఏమిటి?
#GyaneshKumar #CEC #SupremeCourt #CJISuryaKant #ElectionCommission #ECI #SIR #SpecialIntensiveRevision #VoterList #ECINet #ElectionCommissionControversy #Article324 #CECCRemoval #VoterRights #ElectoralReforms











