Home AP పాత కోటకు కొత్త సవాల్.. రాజంపేటలో దూసుకొస్తున్న జనసేన

పాత కోటకు కొత్త సవాల్.. రాజంపేటలో దూసుకొస్తున్న జనసేన

చుక్కాని లేని టీడీపీ.. నేనున్నానంటున్న యల్లటూరు రాజు .
అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న రాజనీతి .
రేసుగుర్రంలా శ్రీనివాసరాజు!

రాజంపేట రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త మోత మోగుతోంది! ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నేలపై ఇప్పుడు జనసేన కొత్త రాజకీయ కేంద్రాన్ని నిర్మించుకుంటోందన్న చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. కేడర్ ఉన్నా దిశ చూపే నాయకత్వంపై టీడీపీకి ప్రశ్నలు తలెత్తుతుంటే.. ‘‘నేనున్నా’’ అంటూ యల్లటూరు శ్రీనివాసరాజు ప్రజల మధ్యకు దూసుకొస్తున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పరిపాలనా అనుభవాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తూ, గ్రామాల్లో పర్యటనలు, కార్యకర్తల సమన్వయం, ఆరు మండలాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు వంటి చర్యలతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటున్నారని ఆయన వర్గం చెబుతోంది. పవన్ కళ్యాణ్‌తో సమన్వయం, యువతతో కనెక్ట్, అన్ని సామాజిక వర్గాలను కలుపుకునే ప్రయత్నం ఆయనకు కొత్త బలంగా మారుతోంది. దీంతో రాజంపేటలో పోరు ఇక టీడీపీ–వైసీపీ మధ్యేనా? లేక మూడో శక్తిగా జనసేన రంగంలోకి దిగిందా? అన్న ప్రశ్న మొదలైంది. స్థానిక ఎన్నికలు ఈ మార్పుకు తొలి పరీక్ష కానున్నాయి. పాత బలాన్ని నమ్ముకునే టీడీపీ.. పాత ఓటు బ్యాంకును కాపాడుకునే వైసీపీ.. కొత్త రాజకీయ పునాది వేస్తున్న జనసేన మధ్య రాజంపేట చుక్కాని ఎవరి చేతిలోకి వెళ్తుందో? ఇప్పుడు ఇదే అసలు సస్పెన్స్!

#RajampetPolitics #JanaSena #YellaturuSrinivasaRaju #SrinivasaRaju #TDP #YSRCP #PawanKalyan #JanaSenaParty #Rajampet #RajampetElections #APPolitics #AndhraPradeshPolitics #LocalElections