Home National_news మహా సర్కార్ ఎన్నికల హామీలు

మహా సర్కార్ ఎన్నికల హామీలు

17


ముందు నుయ్యి.. వెనుక గొయ్యి
‘లాడ్కీ బహిన్’లో 92 లక్షల మందికి షాక్.
లబ్ధిదారుల జాబితాలో భారీ మార్పు.


 ఎన్నికల వేళ సంక్షేమ హామీలతో ప్రజలను ఆకట్టుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు అదే పథకంలో భారీ కోతలు విధించడం రాజకీయ దుమారం రేపుతోంది. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ప్రకటించిన ‘మాజీ లాడ్కీ బహిన్ యోజన’లో ఏకంగా 92 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల ముందు అందరికీ వర్తిస్తుందన్న హామీ, ఎన్నికల తర్వాత అర్హతల పేరుతో భారీ వడపోత జరగడం విమర్శలకు తావిస్తోంది. ఇది నిజంగా అర్హుల గుర్తింపా? లేక ఎన్నికల హామీలకు పరిమితులున్నాయనే సంకేతమా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుపైనా చర్చకు కారణమవుతున్నాయి.