చీరాల వీరరాఘవ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే మాలకొండయ్య భూమిపూజ

8

చీరాల, జూన్ 24(నాదేశం) : చీరాల పట్టణ నడిబొడ్డున కొలువై ఉన్న చారిత్రక ప్రసిద్ధి గాంచిన శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీర రాఘవ స్వామి వారి దేవాలయ పునఃనిర్మాణ పనులకు బుధవారం అత్యంత వైభవంగా అంకురార్పణ జరిగింది. స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఉన్న ఈ ఆలయ పునఃనిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సతీమణి బాలకొండమ్మ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ భూమిపూజ, శంకుస్థాపన మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాలకొండయ్య,బాలకొండమ్మ దంపతులు శ్రీ వేదవల్లి కనకవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామివార్లకు ప్రత్యేక అర్చనలు పూజాదికాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు స్వామి వారి శేషవస్త్రాలు అందించి, వేద ఆశీర్వచనం చేశారు.

భక్తుల సౌకర్యార్థం, ఆలయ వైభవాన్ని కాపాడేలా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో అన్ని హంగులతో ఈ పునఃనిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ నిర్మాణ పనులు ఎమ్మెల్యే చొరవతో ప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహోత్సవంలో శ్రీ వీర రాఘవ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కామినేని బసవేశ్వర శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగయ్య, ఆలయ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

#Chirala #VeeraRaghavaSwamyTemple #VedavalliKanakavalli #TempleRenovation #BhumiPuja #MadduluriMalakondaiah #Balakondamma #SanatanaDharma #TempleDevelopment #AndhraPradeshTemples #ChiralaNews #SpiritualNews #DevadayaDepartment #TempleReconstruction #ReligiousEvent #HinduTemple #PrakasamDistrict #DevotionalNews #TempleHeritage #CommunityDevelopment