గ్రామాభివృద్ధికి నిఫ్టెమ్ విద్యార్థుల ముందడుగు… దమర్లపల్లెలో గ్రామ దత్తత కార్యక్రమం నిర్వహణ

Empowering Rural Communities

గ్రామాభివృద్ధికి నిఫ్టెమ్ విద్యార్థుల ముందడుగు
దమర్లపల్లెలో గ్రామ దత్తత కార్యక్రమం నిర్వహణ

జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థగా కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న నిఫ్టెమ్‌–కుండ్లీ గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా డాక్టర్ ఆసిఫ్ ఇంతెజార్, డాక్టర్ శీతల్ మార్గదర్శకత్వంలో 25 మంది విద్యార్థులు దమర్లపల్లె గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామ దత్తత కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలోని ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వాటికి స్థిరమైన పరిష్కారాలను అన్వేషించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఆహార సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాలను గ్రామీణ అవసరాలకు అనుసంధానిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడం, స్థానికుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని సంస్థ భావిస్తోంది. విద్యార్థులు, గ్రామస్థులు కలిసి పనిచేస్తూ ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన, స్వయం సమృద్ధి గ్రామ నిర్మాణానికి కృషి చేయనున్నారు.