Home Cinema_News రామాయణం.. రావణుడి విశ్వరూపం!

రామాయణం.. రావణుడి విశ్వరూపం!

భారతీయ ఇతిహాసం.. ప్రపంచ వెండితెరపై మహాద్భుత దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంటోంది! రాముడి ధర్మబలం.. రావణుడి అహంకార సామ్రాజ్యం.. సీతాదేవి ఔన్నత్యం.. వెరసి నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణం’ ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. తొలి భాగంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి తమదైన ముద్ర వేస్తే.. రావణుడిగా యశ్ మాత్రం తన విశ్వరూపంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. పది తలల ప్రతాపం నుంచి శివభక్తి వరకు.. ప్రతీకార జ్వాలల నుంచి పతనం దిశగా సాగిన రావణుడి ప్రయాణం వరకు యశ్ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్ర కోసం ఆయన చేసిన సాధన, తెరపై పలికించిన హావభావాలు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే సాంకేతిక అద్భుతాలు, భారీ యాక్షన్ ఘట్టాల మధ్య రామాయణ అసలు ఆత్మ ఎంతవరకు ఆవిష్కృతమైందన్న చర్చా మొదలైంది. ఇదిలా ఉంటే.. రెండో భాగంపై అప్పుడే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రావణుడి కుమారుడు మేఘనాథుడిగా రాఘవ్ జుయల్ మెరుపు పరిచయం.. హనుమంతుడిగా సన్నీ డియోల్ భారీ అవతారం ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచాయ్.

 

#Ramayana #Yash #YashAsRavana #NiteshTiwari #RanbirKapoor #SaiPallavi #SunnyDeol #RaghavJuyal #Bollywood #IndianCinema #MythologicalFilm