Home Celebrity అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ

అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్ షా బస చేసిన ఐటీసీ హోటల్‌కు వెళ్లిన తండ్రీకొడుకులు ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా చిరంజీవి శాలువాతో అమిత్ షాను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. ముగ్గురి మధ్య జరిగిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొనేందుకు అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన సందర్భంగా జరిగిన ఈ మర్యాదపూర్వక సమావేశం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

 

#Chiranjeevi #RamCharan #AmitShah #HyderabadVisit #MegastarChiranjeevi #GlobalStarRamCharan #Tollywood #TeluguCinema #BJP #BJPMahapadayatra