Home Telangana రేవంత్ చేతికి గుచ్చుకోని గులాబీ ముల్లు

రేవంత్ చేతికి గుచ్చుకోని గులాబీ ముల్లు

రెండు పార్టీల మధ్య కుదిరిన రహస్య డీలు..!
అనుముల చేతిలో కార్ స్టీరింగ్ .
కల్వకుంట్ల ఫ్యామిలీతో సీఎం మ్యాచ్ ఫిక్సింగ్..!?
ధర్మపురి అరవింద్ పొలిటికల్ బ్రేకింగ్.

తెలంగాణ రాజకీయాల్లో ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యలు ఒక్కసారిగా వేడి పెంచాయి. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ల మార్పుల వెనుక భారీ అవినీతి ఉందని ఆరోపించిన ఆయన.. కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు భవిష్యత్తులో కలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇంతటితో ఆగని అర్వింద్‌.. కేటీఆర్‌ రాజకీయ భవిష్యత్తుపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేరంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు రేవంత్‌ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా ఉందని వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపారు. అసలు కేసీఆర్‌, రేవంత్‌ మధ్య తెరవెనుక ఏదైనా రాజకీయ అవగాహన ఉందా? కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ భవిష్యత్తులో చేతులు కలుపుతాయా? కేటీఆర్‌ నాయకత్వంపై అర్వింద్‌ ఎందుకు గురిపెట్టారు? ఈ ప్రశ్నలన్నింటికీ తనదైన రాజకీయ అంచనాలతో సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లను రాజకీయంగా గల్లంతు చేస్తామని, బీజేపీ సునామీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాటల యుద్ధం నుంచి ఎన్నికల సమరానికి ఇప్పుడే సంకేతాలిస్తున్నారా? అర్వింద్‌ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహమేంటి? తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇవి సంకేతాలా?

 

#DharmapuriArvind #RevanthReddy #KCR #KTR #Congress #BRS #BJP #TelanganaPolitics #PoliticalAllegations #2029Elections #TelanganaNews