అంత సీన్ లేదన్న ఇరాన్
హర్మూజ్ జలసంధిపై పోరు
చమురుకు గేటు ఎవరి చేతిలో?
ప్రపంచ చమురు సరఫరాకు కీలక ద్వారమైన హర్మూజ్ జలసంధి మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మార్గం భద్రత కోసం ఫీజు వసూలు చేయాలన్న ప్రతిపాదనతో కొత్త చర్చకు తెరలేపగా, ఇరాన్ మాత్రం అలాంటి బెదిరింపులకు తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది. హర్మూజ్‌పై ఆధిపత్య పోరు కేవలం అమెరికా–ఇరాన్ మధ్య వివాదంగా మాత్రమే కాకుండా, ప్రపంచ చమురు మార్కెట్, ఇంధన ధరలు, దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ఎందుకు అంత కీలకం? ట్రంప్ ఫీజు ప్లాన్ వెనుక ఉద్దేశం ఏమిటి? ఇరాన్ ఎందుకు తీవ్రంగా స్పందిస్తోంది? ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఈ సముద్ర మార్గంపైనే నిలిచింది.











