ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టు ఐపీఎల్ 2027కి ముందు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపింది. హార్దిక్‌ను ట్రేడ్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్న వేళ, ముంబై ఇండియన్స్ అతడి ప్రాక్టీస్ ఫొటోలను వరుసగా పోస్ట్ చేయడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. దీంతో కొందరు హార్దిక్ ముంబైలోనే కొనసాగడం ఖాయమని భావిస్తుండగా, మరికొందరు ట్రేడ్ ప్రక్రియలో భాగంగానే ఈ పోస్టు వచ్చిందేమోనని అనుమానిస్తున్నారు. 2015లో ముంబై తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్ 2022లో గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లారు. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను చాంపియన్‌గా నిలిపి, మరో ఏడాది కెప్టెన్‌గా కొనసాగారు. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్ ద్వారా ముంబై తిరిగి తీసుకొచ్చి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే 2024లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలవగా, 2025లో క్వాలిఫయర్-2 వరకు చేరింది. 2026 సీజన్‌లో తొమ్మిదో స్థానంతో ముగించింది. ఈ నేపథ్యంలో హార్దిక్ ట్రేడ్ ఊహాగానాలు మరింత వేడెక్కాయి. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా ఐపీఎల్ ట్రేడ్లలో పూర్తి పారదర్శకత అవసరమని సూచించడం చర్చకు మరింత బలం చేకూర్చింది.
#HardikPandya #MumbaiIndians #MI #IPL2027 #HardikTrade #IPLTrade #IPL #MumbaiIndiansNews #HardikPandyaNews #IPLNews #CricketNews #SunilGavaskar #GujaratTitans #IndianCricket











