Home Celebrity మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

16

హైదరాబాద్ ఫిలింనగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. అతివేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి టాలీవుడ్ నటుడు ధర్మ నివాసంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంటి గేటు, ప్రహారీ గోడ ధ్వంసమయ్యాయి. ఇంట్లో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ధర్మ కుటుంబ సభ్యులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.