ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ పదవిని మాజీ కోచ్, ప్రస్తుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ తిరస్కరించారు. బ్రెండన్ మెకల్లమ్ వైదొలిగిన తర్వాత ఫ్లవర్ పేరు ప్రధానంగా వినిపించినా, తాను ప్రస్తుతం చేస్తున్న కోచింగ్ బాధ్యతలతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆర్‌సీబీతో పాటు ది హండ్రెడ్‌లో లండన్ స్పిరిట్ జట్టుతో పనిచేస్తుండటం తనకు ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీకి తెలియజేసినట్లు చెప్పారు. 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా పనిచేసిన ఫ్లవర్ స్వదేశంలో, విదేశాల్లో యాషెస్ సిరీస్‌లు గెలిపించడంతో పాటు భారత్‌లోనూ చారిత్రక విజయాన్ని అందించారు. అనంతరం ఫ్రాంచైజీ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా ఆర్‌సీబీ, లండన్ స్పిరిట్ జట్లపైనే ఉందని, ఇంగ్లండ్ టెస్టు కోచ్ బాధ్యతలు స్వీకరించే ఆలోచన లేదని స్పష్టంచేశారు. దీంతో కొత్త కోచ్ ఎంపిక ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు మరింత సవాలుగా మారింది.
#AndyFlower #EnglandCricket #RCB #RoyalChallengersBengaluru #BrendonMcCullum #RobKey #EnglandTestTeam #LondonSpirit #TheHundred #CricketNews #SportsNews #IPL #ECB #BreakingNews #LatestNews #TeluguNews #CricketUpdates #EnglandCoach #RCBCoach #AndyFlowerNews











