డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మొత్తం 2,721 పోస్టుల భర్తీకి డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జనరల్ పాఠశాలల్లో ఎస్జీటీ, ఎస్‌ఏ విభాగాలకు సంబంధించి 2,111 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో 350 పోస్టులు, సొసైటీల పరిధిలో ప్రిన్సిపల్స్, పీజీటీ, పీడీ, టీజీటీ కేటగిరీల్లో మరో 260 పోస్టులు ఉన్నాయి. మూడు వారాల తర్వాత పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పరీక్షల షెడ్యూల్, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల ప్రక్రియ, ఫీజు వివరాలు, హాల్‌టికెట్లకు సంబంధించిన సమాచారం వెల్లడించనున్నారు. పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థులు నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
#APDSC2026 #APDSCNotification #TeacherJobs #APTeacherRecruitment #AndhraPradeshJobs #GovernmentJobs #SGTJobs #SchoolAssistant #SpecialEducation #PGTRecruitment #TGTJobs #TeacherVacancies #JobAlert











