రెండు ఉప ఎన్నికల్లో టీవీకే జయభేరి .
తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే పతనం.
మూడో స్థానానికి పరిమితమైన అన్నాడీఎంకే.
తమిళ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన అన్నాడీఎంకేకు ఇప్పుడు అస్తిత్వ సంకటమా? దశాబ్దాల రాజకీయ ఆధిపత్యానికి తెరపడబోతోందా? విజయ్ రాజకీయ వ్యూహం ప్రత్యర్థుల పునాదులనే కదిలిస్తోందా? మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల ఫలితాలు ఈ ప్రశ్నలకు మరింత పదును పెట్టాయి. అన్నాడీఎంకే సిట్టింగ్ స్థానాలనే కైవసం చేసుకున్న టీవీకే, మధురాంతకంలో ఆ పార్టీని మూడో స్థానానికి నెట్టేసింది. డీఎంకే రెండో స్థానంలో నిలవగా, పళనిస్వామి నాయకత్వంపై కొత్త సందేహాలు మొదలయ్యాయి. ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యారన్న విజయ్ ఆరోపణలు, కూటమి రాజకీయాల్లో నెలకొన్న విభేదాలు, పార్టీ మార్పులపై ఊహాగానాలు.. వెరసి తమిళ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ విజయాలు విజయ్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే కాదు.. తన రాజకీయ బలాన్ని చాటుకునే అవకాశం, ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కొనే ధైర్యం, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను మార్చే ఆయుధం! అయితే ఇది అన్నాడీఎంకే అంతానికి ఆరంభమా? లేక తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనా? డీఎంకేకు ముప్పు ఎక్కడి నుంచి రాబోతోంది? తమిళనాట పాత రాజకీయ సమీకరణాలను కూలదోసి కొత్త శకానికి విజయ్ నాంది పలుకుతున్నారా? రెండు ఉప ఎన్నికలు.. మూడు పార్టీల భవిష్యత్తు.. తమిళ రాజకీయాల్లో మొదలైన కొత్త యుద్ధం! అసలు తెరవెనుక ఏం జరిగింది?
#ThalapathyVijay #TVK #TamilagaVettriKazhagam #AIADMK #DMK #TamilNaduPolitics #BypollResults #Madhuranthakam #Dharapuram #EdappadiPalaniswami #VijayPolitics #PoliticalNews









