Home National_news ఢిల్లీలో పంజాబ్ ఆట! కాంగ్రెస్‌లో మారిన కథ

ఢిల్లీలో పంజాబ్ ఆట! కాంగ్రెస్‌లో మారిన కథ

రాహుల్‌ చెంత నేతల పరేడ్.
నిరసన వేదికగా నయా పాలిట్రిక్స్.
పీఠం కోసం కలిసకట్టుగా పోరాటం.


ఢిల్లీలో రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది. ఎన్నికల సంఘంపై పోరాటం పేరుతో వీధుల్లోకి వచ్చిన కాంగ్రెస్ నేతల మధ్య ఎవరు ఎక్కడ నిలబడ్డారు? ఎవరు ఎవరికి దగ్గరగా కనిపించారు? ముఖ్యంగా, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోల్పోయిన కొద్ది రోజులకే అమరీందర్ సింగ్ రాజా వారింగ్ రాహుల్ గాంధీ పక్కన ముందు వరుసలో ఎందుకు కనిపించారు? పోలీసుల అడ్డంకులను దాటుతూ చివరకు రాహుల్‌ను తీసుకెళ్తున్న పోలీసు బస్సుపైకి వారింగ్ ఎక్కడం వెనుక ఉన్న రాజకీయ సందేశం ఏమిటి? ఒకప్పుడు రాహుల్ గాంధీ టీమ్‌లో యువనేతగా ఎదిగిన వారింగ్.. ఇప్పుడు పదవి పోయినా గాంధీ కుటుంబానికి తన అనుబంధం చెక్కుచెదరలేదని చాటుకున్నారా? పంజాబ్‌లో ఆయన ప్రత్యర్థిగా నిలిచిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా అదే నిరసనలో ఉండటం మరో ఆసక్తికర పరిణామం. ఇదే సమయంలో రాహుల్‌కు పాత అనుచరుడైన దీపేందర్ సింగ్ హుడా కూడా ముందువరుసలో కనిపించడం కాంగ్రెస్‌లో అసలు పవర్ సెంటర్ ఎక్కడుందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది. పోలీసులతో ఘర్షణలు, తాజా ఎఫ్‌ఐఆర్‌లు, బీజేపీ తీవ్ర ఆరోపణలు ఈ కథను మరింత వేడెక్కించాయి. ఇది కేవలం ఎన్నికల సంఘంపై నిరసనా? లేక కాంగ్రెస్‌లో భవిష్యత్ నాయకత్వ సమీకరణాలకు తెరలేపుతున్న రాజకీయ సంకేతమా?

 

#RahulGandhi #RajaWarring #PunjabCongress #CharanjitSinghChanni #DeependerSinghHooda #CongressPolitics #DelhiProtest #ElectionCommission #GyaneshKumar #PargatSingh #IndianPolitics #CongressLeadership