Home Inter National News కొట్టుకున్న పైలట్లు కాక్‌పిట్‌లో పోరాటం

కొట్టుకున్న పైలట్లు కాక్‌పిట్‌లో పోరాటం

ప్రయాణికుల్లో కలవరం.
హైజాగ్ అంటూ ప్రచారం .
దుబాయ్ విమానంలో అలజడి .

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో గాల్లోనే ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఒక పైలట్‌ మరో పైలట్‌పై కత్తితో దాడి చేసినట్లు అధికారులు, ప్రత్యక్ష కథనాలు వెల్లడించాయి. ఈ సమయంలో విమానం ఒక్కసారిగా 17,400 అడుగుల మేర కిందకు జారిపోవడం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనకు దారితీసింది. విమానంలో దాదాపు 180 మంది ఉన్నట్లు సమాచారం. ఘటన సమయంలో అత్యవసర సంకేతాలు వెలువడటంతో తొలుత హైజాక్‌ భయాలు నెలకొన్నాయి. అయితే తర్వాతి పరిణామాల్లో అసలు విషయం పైలట్ల మధ్య జరిగిన ఘర్షణగా వెలుగులోకి వచ్చింది.

భారత పైలట్‌ సాహసం

ఈ ఘటనలో గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌ భారతీయుడని తేలింది. దాడి చేసిన సహ పైలట్‌ను అడ్డుకునే క్రమంలో ఆయన గాయపడ్డారని సమాచారం. ప్రయాణికులు కూడా జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహకరించారు. ఈ సమయంలో ఇతర పైలట్లు కాక్‌పిట్‌ బాధ్యతలు చేపట్టి విమానాన్ని నియంత్రించారు. గాయపడిన కెప్టెన్‌ను సౌదీ అరేబియాలోని ఆసుపత్రికి తరలించారు. “మీరు విమానాన్ని కాపాడారు” అంటూ ప్రయాణికులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కెప్టెన్‌ మచ్ఛర్‌కు 13 ఏళ్లకు పైగా వాణిజ్య విమానయాన అనుభవం ఉన్నట్లు సమాచారం.

సౌదీలో అత్యవసర ల్యాండింగ్‌

ఘటన నేపథ్యంలో విమానం మార్గాన్ని మార్చి సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వివరాల ప్రకారం విమానం తొలుత 7700 అత్యవసర సంకేతం, తర్వాత 7500 సంకేతాన్ని పంపింది. విమానం వేగంగా దిగజారడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఘటనకు అసలు కారణం, ఉద్దేశం ఇంకా అధికారిక దర్యాప్తులోనే ఉన్నాయి. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

#Flydubai #FZ1073 #DubaiTelAvivFlight #PilotFight #CockpitIncident #PilotAttack #FlightEmergency #Tabuk #SaudiArabia #HijackAlert #AviationNews #FlydubaiIncident #IndianPilot #EmergencyLanding #FlightNews