Home Cinema_News బాలకృష్ణ మూవీలో కాజల్ అగర్వాల్

బాలకృష్ణ మూవీలో కాజల్ అగర్వాల్

4

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ’ఎన్‌డికె111’ నుంచి మేకర్స్ బిగ్ సర్పైజ్ ఇచ్చారు. శుక్రవారం హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తూ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో గత కొన్ని వారాలుగా ఈ ప్రాజెక్ట్‌పై నెలకొన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కాజల్ సింపుల్ చీరకట్టులో, కళ్లజోడు ధరించి అత్యంత గంభీరంగా కనిపించింది. కార్యాలయ వాతావరణంలో నిలబడి ఉన్న ఆమె లుక్‌లో సీరియస్‌నెస్, పవర్‌ఫుల్ వైబ్ స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ హీరోయిన్‌ను ఇలా డీ`గ్లామర్ లుక్‌లో చూపించడంతో పాత్రపై క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగింది. పోస్టర్‌తో పాటు చిత్ర బృందం కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సినిమా ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ’భగవంత్ కేసరి’ తర్వాత బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ’భగవంత్ కేసరి’లో కాజల్ పాత్రకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ’ఎన్‌బికె111’లో మాత్రం ఆమె పూర్తి స్థాయి కథానాయికగా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుగా భారీ బ్జడెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది.

 

#NBK111 #NandamuriBalakrishna #Balakrishna #KajalAggarwal #NBK111Update #NBK111FirstLook #GopichandMalineni #Tollywood #TeluguCinema #KajalBirthday #KajalFirstLook #BhagavanthKesari #BalayyaBabu #MassDirector #MovieUpdate #CinemaNews #UpcomingMovie #TeluguMovieUpdates #ActionDrama #FilmNagar #SouthCinema #EntertainmentNews #KajalAggarwalFans #NBKFans #BalayyaFans #FirstLookPoster #MovieBuzz #TollywoodNews #BigBudgetMovie #HeroineUpdate