Home Naadesam_Special బడ్జెట్ ఫోన్.. గోల్డెన్ ఛాన్స్ గాన్

బడ్జెట్ ఫోన్.. గోల్డెన్ ఛాన్స్ గాన్

ఫోన్ కొనాలా.. వెయిట్ చేయాలా?
కంపెనీల లాభాల వేట.. సర్కార్ ట్యాక్స్ ఆట.
ఆండ్రాయిడ్ జీబీలతో కొత్త ఫిట్టింగ్.
అదనపు ధరలతో జేబులు కట్టింగ్.
స్మార్ట్ మొబైల్.. గుండె గుభేల్.

ఒకప్పుడు రూ.10–15 వేలకే మంచి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేది. ఇప్పుడు అదే స్థాయి ఫోన్‌ కోసం రూ.20–25 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, AI డేటా సెంటర్లకు భారీగా చిప్‌ల డిమాండ్‌ రావడం, దిగుమతి ఖర్చులు పెరగడం వంటి కారణాలతో బడ్జెట్‌ ఫోన్ల ధరలు పైకి వెళ్తున్నాయి. కొన్ని మోడళ్ల ధరలు రూ.1,000 నుంచి రూ.3,500 వరకు పెరిగాయి. దీంతో సామాన్యుడి బడ్జెట్‌ కుదేలవుతోంది. 8GB RAM, 256GB స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ కావాలంటే రూ.25 వేల లోపు మంచి ఎంపిక దొరకడం కష్టంగా మారుతోంది. ఫోన్‌ ఇప్పుడు విలాస వస్తువు కాదు.. చదువు, ఉద్యోగం, బ్యాంకింగ్‌, డిజిటల్‌ చెల్లింపులు, ప్రభుత్వ సేవలకు నిత్యావసర సాధనంగా మారింది. అయినా ధరలు మాత్రం తగ్గడం లేదు. కంపెనీలు లాభాలను కొంత తగ్గించుకోలేవా? ప్రభుత్వాలు బడ్జెట్‌ ఫోన్లపై పన్నుల భారాన్ని తగ్గించలేవా? ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ చౌకగా అందుబాటులోకి వస్తున్న సమయంలో సామాన్యుడి ఫోన్‌ మాత్రం ఎందుకు ఖరీదవుతోంది? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి కొనుగోలుదారుడిని వేధిస్తోంది. కొత్త ఫోన్‌ కొనాలా.. ఉన్నదానికే రిపేర్‌ చేయించుకుని కొనసాగాలా.. అన్న సందిగ్ధంలో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి.

 

 

#BudgetSmartphones #SmartphonePrices #PhonePriceHike #AndroidPhones #BudgetPhones #MobilePhones #SmartphoneIndia #MemoryChipPrices #AIDataCenters #8GBRAM #256GBStorage #TechNews #MobilePriceHike #IndianConsumers