Home Sports_News భారత్ వ్యూహంపై హర్ష భోగ్లే ఫైర్ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు

భారత్ వ్యూహంపై హర్ష భోగ్లే ఫైర్ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు



శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ తీరుపై ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే తీవ్ర విమర్శలు చేశారు. కీలక సమయంలో వేగంగా పరుగులు చేయకుండా ఎక్కువ సమయం తీసుకోవడాన్ని భోగ్లే తప్పుపట్టారు. ముఖ్యంగా మ్యాచ్‌పై వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉన్న సమయంలో మరింత వేగంగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డారు. భోగ్లే తన సోషల్ మీడియా పోస్టులో భారత్ చివరి 40 నిమిషాల బ్యాటింగ్‌పై సందేహం వ్యక్తం చేశారు. “భారత్ వ్యూహం ఏంటో అర్థం కాలేదు.. సమయాన్ని కోల్పోయింది.. పరుగులు మాత్రం పెద్దగా చేయలేదు” అంటూ విమర్శించారు. వర్షం వచ్చే అవకాశం ఉన్నప్పుడు శ్రీలంకను ఆలౌట్ చేసేందుకు భారత బౌలర్లకు వీలైనంత ఎక్కువ సమయం ఇవ్వాల్సిందని సూచించారు.

 

#HarshaBhogle #TeamIndia #INDvsSL #IndiaVsSriLanka #SriLankaTest #GalleTest #IndianCricket #TestCricket #CricketNews #IndiaBatting #BattingStrategy #HarshaBhogleComments #SportsNews #TeamIndiaNews