Home National_news బెంగళూరులో సగం ఓట్లు గల్లంతు

బెంగళూరులో సగం ఓట్లు గల్లంతు


నాలుగు కారణాలతో ఓటర్లపై వేటు.
లిస్ట్ ప్రిపేర్ చేస్తోన్న ఈసీ అధికారులు .

కర్ణాటకలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో బెంగళూరు అత్యంత కీలక జిల్లాగా మారింది. ఇంటింటి సర్వే సందర్భంగా నగరంలోని దాదాపు సగం మంది ఓటర్లు ఆబ్సెంట్, షిఫ్టింగ్, డూప్లికేట్, డెడ్, ఇతర కారణాలతో (ASDDO) విభాగంలో చేర్చారు. ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన వివరాల ప్రకారం బెంగళూరు అర్బన్ జిల్లాలో మొత్తం 40.21 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 55.39 శాతం వివరాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. మిగిలిన 44.61 శాతం అంటే 17.93 లక్షల మంది ఓటర్లు ఏఎస్‌డీడీఓ లేదా సేకరించని జాబితాలో చేరారు. బీబీఎంపీ దక్షిణ మండలంలో 51.18 శాతం, సెంట్రల్ మండలంలో 47.85 శాతం, ఉత్తర మండలంలో 46.95 శాతం ఓటర్లు ఈ జాబితాలో ఉన్నారు. నగరవ్యాప్తంగా మొత్తం 48.9 లక్షల మందికి పైగా ఓటర్లు ఈ విభాగాల్లో గుర్తించబడటం చర్చనీయాంశమైంది. రాష్ట్ర సగటు 19.93 శాతంతో పోలిస్తే బెంగళూరులో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండటం అధికారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఓటు తొలగింపు కాదన్న ఎన్నికల సంఘం

ఏఎస్‌డీడీఓ విభాగంలో పేరు నమోదైందంటే ఓటు తొలగించబడుతుందని భావించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గైర్హాజరు, నివాసం మార్చుకున్నవారు, డూప్లికేట్ నమోదులు, మరణించినవారు, ఇతర కారణాలతో గుర్తించిన ప్రతి కేసును మరోసారి పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపింది. బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు ఆగస్టు 8 వరకు తప్పుగా నమోదైన వివరాలను సవరించవచ్చని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 5.54 కోట్ల మంది ఓటర్ల వివరాలు సేకరించగా, 1.10 కోట్ల మంది ప్రస్తుతం ఏఎస్‌డీడీఓ లేదా సేకరించని జాబితాలో ఉన్నారు. కొత్తగా ఓటర్ల నమోదు కోసం బెంగళూరు ప్రాంతానికి 10 లక్షల ఫారం–6 దరఖాస్తులను ఎన్నికల సంఘం పంపిణీ చేసింది. జూన్ 16 నుంచి ఆగస్టు 5 వరకు ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపులకు సంబంధించిన ఫారం–6, 6ఏ, 7, 8 కింద రాష్ట్రవ్యాప్తంగా 12.32 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో తుది ఓటరు జాబితా రూపకల్పనకు ముందు విస్తృత స్థాయిలో పరిశీలన కొనసాగుతోంది.

 

#Bengaluru #Karnataka #VoterList #SIR #ElectionCommission #ElectoralRoll #VoterVerification #ASDDO #KarnatakaPolitics #BengaluruUrban #ElectionNews #VoterRevision #Democracy #IndianElections #Form6 #ECI #VotingRights #PoliticalNews #LatestNews #IndiaNews