Home Sports_News టీమ్ ఇండియాకు ఫీల్డింగ్ కోచ్ వీడ్కోలు రోహిత్ శర్మ భావోద్వేగ సందేశం

టీమ్ ఇండియాకు ఫీల్డింగ్ కోచ్ వీడ్కోలు రోహిత్ శర్మ భావోద్వేగ సందేశం



ఐదేళ్ల పాటు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించిన టీ. దిలీప్‌కు బీసీసీఐ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియా ద్వారా దిలీప్ సేవలను ప్రశంసించాడు. జట్టులో అద్భుతమైన మార్పు తీసుకొచ్చిన వ్యక్తి దిలీప్ అని, తెరవెనుక ఎంతో కష్టపడే నిజమైన హీరో అని కొనియాడాడు. 2021 నుంచి భారత జట్టుతో పనిచేసిన దిలీప్ హయాంలో టీమ్ ఇండియా రెండు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు ఆసియా కప్‌లు గెలుచుకుంది. 2023లో ప్రారంభించిన ‘ఫీల్డింగ్ మెడల్’ సంప్రదాయం జట్టులో ఫీల్డింగ్ సంస్కృతిని మరింత బలోపేతం చేసిందని దిలీప్ తన వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు. భారత జట్టు బ్యాడ్జ్ ధరించి సేవలందించడం జీవితాంతం గుర్తుండిపోతుందని భావోద్వేగంగా తెలిపాడు. దిలీప్ స్థానంలో సుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించింది.

 

#TDilip #RohitSharma #TeamIndia #BCCI #FieldingCoach #IndianCricket #CricketNews #RohitSharmaMessage #TDilipFarewell #T20WorldCup #ChampionsTrophy #AsiaCup #SubhadeepGhosh #TeamIndiaNews #SportsNews