ప్రొద్దుటూరు, అక్టోబర్ 21: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మండల పరిధిలోని 24 ఎంపీటీసీ స్థానాలకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. అయితే, తొలిరోజు 24 స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వైసీపీ, టీడీపీలకు చెందిన పలువురు కీలక నేతలను హౌస్ అరెస్టు చేశారు. దీంతో మండలంలో ఎంపీటీసీ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ తొలిరోజు అభ్యర్థులెవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
24 ఎంపీటీసీ స్థానాలు.. తొలిరోజు బోణీ లేదు!
Proddatur MPTC Elections 2026 | No Nominations on Day One











