బిజినెస్ ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!
మైదానంలో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యాడు. 37 ఏళ్ల వయసులో తొలిసారిగా లింక్డ్‌ఇన్‌లో అడుగుపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ తన భవిష్యత్ లక్ష్యాలను సుదీర్ఘ పోస్టు ద్వారా వెల్లడించాడు. భారత క్రీడా బ్రాండ్లను ప్రపంచ వేదికపై నిలబెట్టడమే తన ఆశయమని స్పష్టం చేశాడు. ‘‘దార్శనికత స్పష్టంగా ఉంది.. మనందరినీ మించి నిలిచిపోయే నిర్మాణాన్ని సృష్టించాల్సిన సమయం వచ్చింది’’ అంటూ తన కొత్త ప్రయాణానికి దిశానిర్దేశం చేశాడు. స్పోర్ట్స్‌వేర్ సంస్థ అజిలిటాస్‌లో పెట్టుబడిదారుడిగా చేరడంతో పాటు వన్ 8వరల్డ్ బ్రాండ్‌కు సహ వ్యవస్థాపకుడిగా, సృజనాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. కేవలం ఆటల్లో పాల్గొనడమే కాదు.. ప్రపంచ క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలోనూ భారత్ భాగస్వామి కావాలన్నది కోహ్లీ ఆకాంక్ష. ఈ లక్ష్యంతో ప్యూమాతో ఎనిమిదేళ్లకు సంబంధించిన సుమారు రూ.300 కోట్ల ఒప్పందం పొడిగింపును వదులుకుని, అజిలిటాస్‌లో సుమారు రూ.40 కోట్ల సొంత పెట్టుబడి పెట్టినట్లు కథనం పేర్కొంది. తయారీ నుంచి ఉత్పత్తుల విక్రయం వరకు సమగ్ర క్రీడా వ్యాపార వ్యవస్థను నిర్మించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ఢిల్లీలో వన్8వరల్డ్ బ్రాండ్‌ను ఘనంగా పరిచయం చేసిన కోహ్లీ.. ఇప్పుడు తన క్రికెట్ అనుభవాన్ని వ్యాపార దృష్టితో మేళవిస్తున్నాడు. బ్యాట్‌తో రికార్డులు సృష్టించిన ఈ రన్‌మెషీన్.. భారత క్రీడా బ్రాండ్లకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే కొత్త ఇన్నింగ్స్‌లో ఎలాంటి మైలురాళ్లు అందుకుంటాడో ఆసక్తికరంగా మారింది.
#ViratKohli #Agilitas #One8World #ViratKohliBusiness #LinkedIn #SportsBusiness #IndianSportswear #Entrepreneurship #Puma #IndianCricket #BusinessNews #SportsIndustry











