Home National_news రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్ ఢిల్లీలో రాహుల్ పోస్టర్లు

రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్ ఢిల్లీలో రాహుల్ పోస్టర్లు

రాజధానిలో పొలిటికల్ హైప్.

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పార్టీ శ్రేణులు వినూత్నంగా ప్రచారం కల్పించాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ఇందిరా భవన్ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో రాహుల్‌ను ‘రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్’గా అభివర్ణిస్తూ పోస్టర్లు వెలిశాయి. రాహుల్ చిత్రంతో పాటు బ్యాట్‌మ్యాన్ చిత్రాన్ని ఉంచిన పోస్టర్లలో ‘ది సైలెంట్ గార్డియన్’, ‘ఎ వాచ్‌ఫుల్ ప్రొటెక్టర్’ వంటి క్యాప్షన్లు కనిపించాయి. ‘లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ – ది రియల్ లైఫ్ బ్యాట్‌మ్యాన్’ అంటూ మరో క్యాప్షన్‌ను కూడా ముద్రించారు.

తెల్ల టీషర్ట్‌పై పవన్ ఖేరా కామెంట్

ఢిల్లీ ప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అక్షయ్ లక్రా ఆధ్వర్యంలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందిరా భవన్ ప్రవేశద్వారం, 24 అక్బర్ రోడ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం, రైసినా రోడ్‌లోని భారత యువజన కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోస్టర్లు కనిపించాయి. ఈ ప్రచారంపై కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా స్పందిస్తూ “అందరు హీరోలు కేప్‌లు ధరించరు.. కొందరు తెల్ల టీషర్ట్ ధరిస్తారు” అంటూ రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ సాధారణంగా తెల్ల టీషర్ట్, కార్గో ప్యాంట్‌తో కనిపిస్తారన్న విషయం తెలిసిందే.

ఇన్‌స్టాగ్రామ్ కామెంట్‌కు కొనసాగింపేనా?

కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. “మీరు బ్యాట్‌మ్యాన్‌నా?” అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, రాహుల్ సరదాగా స్పందించారు. “బ్యాట్‌మ్యాన్, నేను ఒకే గదిలో ఉన్నట్లు ఎవరూ ఎప్పుడూ చూడలేదు” అంటూ చమత్కరించారు. జనరేషన్‌ జెడ్‌తో నేరుగా మమేకమయ్యే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఆ కార్యక్రమంలో రాజకీయ అంశాలతో పాటు వ్యక్తిగత, సరదా ప్రశ్నలు కూడా రాహుల్‌ను ఉద్దేశించి వచ్చాయి. ఇప్పుడు ఢిల్లీలో వెలిసిన బ్యాట్‌మ్యాన్ పోస్టర్లు ఆ వ్యాఖ్యకు రాజకీయ ప్రచార రూపం ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.

#RahulGandhi #RealLifeBatman #Batman #Congress #CongressPosters #Delhi #IndiraBhawan #PawanKhera #AkshayLakra #RahulGandhiPosters #CongressCampaign #DelhiPolitics #GenZ #PoliticalBuzz #IndianPolitics