జంతర్‌మంతర్ నిరసనపై పోలీసుల ఆంక్షలు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అక్టోబర్ 10న నిరసన చేపట్టేందుకు తాము పది రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని సీజేపీ తెలిపింది. సీజేపీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో నిరసనకు సంబంధించిన లేఖను సమర్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ ఆందోళన నిర్వహించనున్నట్లు పార్టీ పేర్కొంది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం జంతర్‌మంతర్‌లో నిరసనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.
పోలీసుల నిబంధనలు
జంతర్‌మంతర్‌లో సమావేశం, ధర్నా, నిరసన నిర్వహించాలంటే సంబంధిత అనుమతి కోసం డీసీపీ, న్యూఢిల్లీ జిల్లా అధికారికి కనీసం పది రోజుల ముందే దరఖాస్తు చేయాలని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అక్కడ గరిష్ఠంగా 1,000 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. 1,000 నుంచి 50,000 మంది వరకు పాల్గొనే ఆందోళనలకు రాంలీలా మైదాన్, 50,000 మందికి పైగా ఉంటే బురారీని నిర్దేశించిన ప్రాంతాలుగా పేర్కొన్నారు. ఈ నిబంధనలు సుప్రీంకోర్టు 2018 తీర్పు నేపథ్యంలో అమల్లోకి వచ్చినట్లు పోలీసులు వివరించారు. మరోవైపు, తాము ముందుగానే సమాచారం ఇచ్చినా అనుమతి ఎందుకు అవసరమన్న ప్రశ్నను సీజేపీ లేవనెత్తింది.
#CJP #JantarMantar #SauravDas #GyaneshKumar #CECResignation #DelhiPolice #Protest #JantarMantarProtest #SIR #VoterList #ElectionCommission #DelhiProtest #CJPProtest #ElectoralRolls #IndianPolitics











