Home AP స్థానిక ఎన్నికలపై వైసీపీ దూకుడు

స్థానిక ఎన్నికలపై వైసీపీ దూకుడు

క్షేత్రస్థాయి బలంపై జగన్ వరుస సమీక్షలు.

స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలవుతున్న వేళ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై మంగళవారం సమీక్ష నిర్వహించిన జగన్‌.. ఆయా ప్రాంతాల నేతలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు. రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలం, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. గత మూడు నెలలుగా ప్రతి వారం ముఖ్య నేతలతో స్థానిక ఎన్నికలపై వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించిన ఆయన.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై వివరాలు సేకరిస్తున్నారు. సమావేశాల్లో భాగంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో వన్‌టు వన్‌ భేటీలకు జగన్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, నాయకుల పనితీరు, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల సన్నద్ధతపై నేరుగా ఆరా తీస్తున్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండేలా నియోజకవర్గాల వారీగా ముందస్తు ప్రణాళిక, సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమన్వయంపై జగన్‌ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి

 

#YSJagan #YSJaganMohanReddy #YSRCP #APLocalBodyElections #APLocalElections #YSRCPLocalElections #JaganReview #LocalElections #WestGodavari #YSRCPStrategy #CandidateSelection #GrassrootsPolitics #AndhraPradeshPolitics #MunicipalElections #APPolitics